VIDEO: సందడిగా మారిన హుస్సేన్ సాగర్ మార్గం

HYDలో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాల్లో భాగంగా హుస్సేన్ సాగర్‌లో గణపతిని నిమజ్జనం చేసేందుకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనాల్లో యువత పెద్దఎత్తున పాల్గొని సంబరంగా నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ ప్రాంతం సందడిగా నెలకొంది.