VIDEO: ఐనవోలు మల్లన్న సన్నిధిలో మహా సంప్రోక్షణ
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇవాళ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, శతరుద్రాభిషేకాలు, అన్నపూజ నిర్వహించి, అనంతరం తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రభాకర్, కార్యనిర్హణ అధికారి సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.