నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KDP: ఖాజీపేట మండలంలో 220 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు. ఖాజీపేట, దుంపలగట్టు, ఏటూరు, కూనవారిపల్లె, ముత్తులూరుపాడు, నాగసానిపల్లె సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.