ప్రతి నియోజకవర్గంలో పార్క్ ఏర్పాటుకు చర్యలు

ప్రకాశం: జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకువాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.