GOOD NEWS: జీతాలు పెంపు

TG: అంగన్వాడీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించింది. అంగన్వాడీ టీచర్ల తరహాలోనే మినీ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు వర్తిస్తాయని పేర్కొంది. ఏప్రిల్ నుంచి వారికి రూ.13,650 వేతనం చెల్లించనుంది. కాగా, ఇప్పటివరకు మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800 వేతనం అందింది.