VIDEO: సాంప్రదాయబద్ధంగా ఎద్దుకు అంత్యక్రియలు

ADB: భోరజ్ మండలం లేఖర్వాడ గ్రామానికి చెందిన అరికెల శ్రీకాంత్ పొలంలో 30 ఏళ్లుగా పనిచేసిన బసవన్న అనే ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. దానిపై ఉన్న ప్రేమతో యజమాని శ్రీకాంత్, గ్రామస్థులు కలిసి డప్పుల చప్పుళ్లతో సాంప్రదాయబద్ధంగా దానికి అంత్యక్రియలు నిర్వహించి, తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన స్థానికులను కదిలించింది.