సాగునీరు అందించాలని ఇరిగేషన్ ఎస్‌ఈకి వినతి
SRCL: తంగళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల రైతులు కాళేశ్వరం ప్యాకేజీ-11 కాలువ పనులు పూర్తి చేయాలని కోరుతూ సిద్దిపేట ఇరిగేషన్ ఎస్‌ఈకి బుధవారం వినతి పత్రం ఇచ్చారు. నీరు లేక దాసారం, బస్వాపూర్, భజనపల్లి, అంక్సాపూర్, లక్ష్మీపూర్, పాపాయిపల్లి, గోపాల్‌రావుపల్లి, తాడూర్ రైతులు 9559 ఎకరాలకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారని వెంటనే పనులు పూర్తి చేయాలను కోరారు.