గెలుపు కోసం పూజలు

యాదాద్రిభువనగిరి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని నాయకులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మోటకొండూరు మండలం అమ్మనబోలులో గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాయిని రామచంద్రా రెడ్డి, ఎంపీటీసీ స్వామి, బీస కృష్ణంరాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.