దరఖాస్తుల ఆహ్వానం...
BHNG: యాదాద్రి వైద్య కళాశాల పారామెడికల్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ మెడికల్ అనస్థీషియా టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో చేరేందుకు ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులని పేర్కొన్నారు.