ఘనంగా మహనీయుల విగ్రహాలకు భూమి పూజ కార్యక్రమం

ఘనంగా మహనీయుల విగ్రహాలకు భూమి పూజ కార్యక్రమం

వరంగల్ పట్టణ కేంద్రంలోని పెట్రోల్ పంప్ జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల ఏర్పాటుకు మంగళవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఉమా-దామోదర్, సిద్ధం రాజు హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు క్రాంతికుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.