గవర్నర్ చేతుల మీదగా అవార్డు అందుకున్న కలెక్టర్
WGL: జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకు అవార్డు అందజేయబడింది. జిల్లాలో గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వినూత్న ఓటర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.