100 మంది ప్రయాణికులు.. బస్సు సీజ్

100 మంది ప్రయాణికులు.. బస్సు సీజ్

AP: పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పోలీసులు ఓ ప్రైవేట్ బస్సును సీజ్ చేశారు. ఒడిశా నుంచి విజయవాడ వస్తున్న బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు అల్లూరి జిల్లా పోలీసులు గుర్తించారు. బస్సులో తనిఖీలు చేయగా 100 మందికి పైగా జనం ఉన్నారు. దీంతో వెంటనే బస్సును సీజ్ చేసి చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన ప్రమాదాల దృష్ట్యా అధికారులు నిఘా పెంచారు.