మోగిన సైరన్.. మళ్లీ శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తే అవకాశం

మోగిన సైరన్.. మళ్లీ శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తే అవకాశం

NDL: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఏ క్షణంలోనైనా డ్యాం గేట్లను మళ్లీ తెరిచే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో నాలుగోసారి డ్యాం గేట్లను తెరిచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు మత్స్యకారులను అలెర్ట్ చేస్తూ జలాశయం వద్ద సైరన్ మోగించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో డ్యాం అన్ని గేట్లనూ మూసేసిన సంగతి తెలిసిందే.