మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ నాయకులు

NGKL: అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజును అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదామని అన్నారు.