భక్తిశ్రద్ధలతో గంగాజలాలు ఊరేగింపు

భక్తిశ్రద్ధలతో గంగాజలాలు ఊరేగింపు

CTR: పుంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్యులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకించే పవిత్ర గంగా జలాలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు గంగా జలాలకు పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి అభిషేకించారు. అనంతరం హోమాలు ప్రారంభించారు.