'పనికి సమాన వేతనాన్ని చెల్లించాలి'
VKB: సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.