ఆటోని ఢీకొట్టిన.. RTC బస్సు..!
VZM: రాజాం-పాలకొండ రోడ్డులో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పాసింజర్ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటో బోల్తా పడగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయినట్లు తెలిపారు. అదృష్టవశాత్తూ ఆటోలో ప్రయాణికులు లేరని ఎవరికీ తీవ్ర గాయం కాలేదన్నారు. స్థానికులు వెంటనే స్పందించి ఆటోను పైకి లేపి పోలీసులకు విషయం తెలియాజేసినట్లు పేర్కొన్నారు.