35 ఏళ్ల తర్వాత ఒక్కటైన పూర్వ విధ్యార్థులు
NLR: కావలి గాయత్రీనగర్‌లోని నలంద పాఠశాలలో 35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు 'నలంద మహోత్సవం@35' పేరిట ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సాంస్కృతిక, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యనందించిన గురువులను ఘనంగా సత్కరించి, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.