అక్రమ గ్యాస్ సిలిండర్ల పట్టివేత
SDPT: బెజ్జంకి మండలంలోని బేగంపేటలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ బయటపడింది. అనుమతులు లేకుండా ఓ ఇంట్లో 19 సిలిండర్లు నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో సిద్దిపేట డీఎస్ఓ తనూజ, డీఎల్‌ఎంఓ శివరంజని బృందంతో కలిసి ఆకస్మిక దాడి చేశారు. సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు