గుండుమల్ మండలంలో 83.6% పోలింగ్ నమోదు
NRPT: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలో 83.6% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నేటి ఉదయం నుంచి మందెకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఊపందుకుందని వెల్లడించారు. ఉదయం 9 గంటలకు 19.56%, 11 గంటల సమయానికి 53.26% పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.