ఇసుక రీచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఇసుక రీచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: ఉప్పునుంతల మండలంలోని మొల్గర ఇసుక రీచ్‌ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం తనిఖీ చేశారు. ఇసుక రవాణాకు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతులు ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో వాహనాలను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.