గురువు నేర్పిన విద్యలో విద్యార్థులు రాణించాలి: నీలిమ రెడ్డి
KRNL: గురువు నేర్పిన విద్యలో ప్రతీ విద్యార్థి రాణించాలని జిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షురాలు నీలిమ రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్ బాల్ రెండో రోజు పోటీలను ఆమె ప్రారంభించారు. తమ గురువు భూషణ్ రావు శిక్షణలో తాము ఉన్నత స్థానాలకు చేరుకున్నామని తెలిపారు.