ట్రోల్‌కు గురవుతున్న బీజేపీ ఎంపీ

BJP MP అనురాగ్ ఠాకూర్ నెట్టింట ట్రోల్‌కు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలకు వెళ్లిన ఎంపీ అక్కడి విద్యార్థులను మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ పిల్లలంతా నీల్ ఆర్మ్‌స్టాంగ్ అని చెప్పారు. వెంటనే MP ఆయన కాదని, హనుమాన్ అని సమాధానమిచ్చారు. దీంతో అంతరిక్షయానం చేసిన తొలి వ్యక్తి యూరీగగారిన్ అంటూ MPని ట్రోల్ చేస్తున్నారు.