పెర్కవేడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతి

పెర్కవేడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతి

WGL: రాయపర్తి మండలంలో పెర్కవేడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సత్య శారద కు వినతిపత్రం సమర్పించారు. 40 గ్రామ పంచాయితీలతో ఉన్న రాయపర్తి మండలం పరిపాలనపరంగా పెద్దదిగా ఉండటంతో, జాతీయ రహదారికి తూర్పు వైపున ఉన్న 17 గ్రామ పంచాయితీలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరం అవుతుందని పేర్కొన్నారు.