ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్సై

NRML: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పార్డీ బి గ్రామస్థులతో, గణేష్ మండపాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండపాలు ఏర్పాటు చేసే సభ్యులు పర్మిషన్ తీసుకోవాలని, మండపాల వద్ద అధిక శబ్దం కలిగిన సౌండ్ స్పీకర్లు వాడవద్దని తెలిపారు.