నేడు బండలాగుడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!
కడప: నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.