శ్రీ కాశీవిశ్వేశ్వర దేవాలయాన్ని సందర్శించిన కలెక్టర్
PPM: పార్వతీపురం మండలం అడ్డాపుశిలలో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను జేసీతో కలిసి పరిశీలించారు. రద్దీగా ఉన్న దేవాలయాలు, మతపరమైన సమావేశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.