ఈనెల 17న మండల పరిషత్ సర్వసభ్యసమావేశం

ఈనెల 17న మండల పరిషత్ సర్వసభ్యసమావేశం

ప్రకాశం: కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 17న ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ శర్మ తెలిపారు. సమావేశం ఎజెండాలో చర్చించాల్సిన అంశాలపై 24 శాఖల అధికారులకు సర్కులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ సమావేశానికి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.