ఇల్హాన్‌ ఒమర్‌ను తిరిగి పంపిస్తే స్వాగతిస్తాం: సోమల్యాండ్‌

ఇల్హాన్‌ ఒమర్‌ను తిరిగి పంపిస్తే స్వాగతిస్తాం: సోమల్యాండ్‌

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఇమిగ్రేషన్ మోసానికి పాల్పడిందని, ఆమెను దేశ బహిష్కరణ చేయాలని అన్నారు. దీనిపై సోమల్యాండ్ ప్రభుత్వం X వేదికగా ఆసక్తికరంగా స్పందించింది. 'బహిష్కరణా? మీరు కేవలం మా యువరాణిని తిరిగి తన రాజ్యానికి పంపిస్తున్నారు. మేము ఆమెను సాదరంగా ఆహ్వానిస్తాం' అంటూ చమత్కరించింది.