మహిళపై దాడి.. కేసు నమోదు

మహిళపై దాడి.. కేసు నమోదు

GMTR: తెనాలి మండలం మల్లెపాడు గ్రామంలో స్థల వివాదం నేపథ్యంలో మహిళపై దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది. స్థానికురాలు రాజమ్మపై ఆమె బావ యేసోబు దాడి చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో రాజమ్మకు గాయాలు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తెనాలి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.