'గ్రామ సచివాలయ సేవలు పారదర్శకంగా, వేగంగా అందాలి'
అన్నమయ్య: నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని కచ్చితంగా కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.