VIDEO: 'కార్వేటి నగరం, వెదురుకుప్పంలను తిరుపతి జిల్లాలో కలపాలి'
CTR: కార్వేటి నగరం,వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని GD.నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి యుగంధర్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.