రాకెట్ ప్రయోగం విజయవంతం.. మోదీ స్పందన

రాకెట్ ప్రయోగం విజయవంతం.. మోదీ స్పందన

CMS-3 విజయవంతం కావడంపై PM మోదీ స్పందించారు. 'మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉంది. భారతదేశ అత్యంత బరువైన ఉపగ్రహం CMS-3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు అభినందనలు. మన శాస్త్రవేత్తల శక్తితో, మన అంతరిక్ష రంగం ఆవిష్కరణకు పర్యాయపదంగా మారడం ప్రశంసనీయం. వారి విజయాలు జాతీయ పురోగతిని పెంచాయి. అనేక జీవితాలకు సాధికారత కల్పించాయి' అని కొనియాడారు.