పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

W.G: తణుకు పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 51 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ. 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే, పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.