విధులకు గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్ ఆగ్రహం

విధులకు గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్ ఆగ్రహం

VZM: గజపతినగరం మండలంలో కలెక్టర్ S.రాంసుందర్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా పురిటిపెంట-1 అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ విధుల్లో ఉండాల్సిన అంగన్వాడీ కార్యకర్త గైర్హాజరు కావడాన్ని గుర్తించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నారుల సంరక్షణ, పౌష్టికాహార పంపిణీలో ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.