శోభాయాత్రతో దద్దరిల్లనున్న హైదరాబాద్

శోభాయాత్రతో దద్దరిల్లనున్న హైదరాబాద్

HYD: నగరం శ్రీరామ నవమి శోభాయాత్రకు ముస్తాబైంది. ఈ నెల 26, 27 తేదీల్లో నగరం కాషాయమయంగా మారనుంది. హౌసింగ్ బోర్డు,   ధూల్‌పేట నుంచి కోటి వరకు సాగే ఈ భారీ ర్యాలీలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దేశంలోనే అతిపెద్ద శోభాయాత్రగా గుర్తింపు పొందిన ఈవేడుక కోసం పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నగర గల్లీలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లానున్నాయి.