మీడియా సంస్థలు సంయమనం పాటించాలి: రక్షణశాఖ

మీడియా సంస్థలు సంయమనం పాటించాలి: రక్షణశాఖ

తాజా పరిస్థితుల నేపథ్యంలో మీడియా సంస్థలు సంయమనం పాటించాలని ఆయా సంస్థలకు రక్షణశాఖ సూచించింది. సైనికుల చర్యలు, కదలికలపై సంయమనం పాటించాలని పేర్కొంది. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు జాగ్రత్తగా వ్యవహరించాలని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులపై సంబంధిత అధికారులే బ్రీఫింగ్స్ ఇచ్చేందుకు అర్హులని స్పష్టం చేసింది.