కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులకు అస్వస్థత

TG: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు, కలుషిత నీరే దీనికి కారణమని ధృవీకరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.