రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

VSP: విద్యుత్ సమస్యల వేగవంత పరిష్కారానికి సోమవారం ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు 11 జిల్లాల వినియోగదారులు 8688400499కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.