అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

GNTR: నల్లపాడు శ్రీనివాసకాలనీలో బుధవారం అంగన్‌వాడీ కార్యకర్త కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోషకాహార పదార్థాలు సక్రమంగా సరఫరా చేయడం లేదని పిల్లల తల్లులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణకు వచ్చి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపం చెందిన ఆమె మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, తోటి సిబ్బంది ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.