అపరిశుభ్రంగా వంటగది.. ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది అపరిశుభ్రంగా ఉండటం గమనించి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చూపిన డిప్యూటీ వార్డెన్, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్‌లను సస్పెండ్ చేయమని, ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయమని సంబంధించిన అధికారులను ఆదేశించారు.