కేంద్రానికి మంత్రి తుమ్మల కీలక విజ్ఞప్తి

TG: రాష్ట్రంలో యూరియా కొరతను అధిగమించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ఈ వారంలోనే 50 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను ఆయన కోరారు. రాష్ట్ర రైతాంగ అవసరాల దృష్ట్యా వెంటనే యూరియాను పంపించాలని కోరుతూ మంత్రి లేఖ రాశారు.