బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

NDL: బనగానపల్లె మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక మగ బిడ్డకు జన్మనివ్వడంతో విషయం వెలుగు చూసింది. దీంతో శనివారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బనగానపల్లె సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. అనంతరం బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.