కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
SRD: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నాయకులు రాజేందర్ నాయక్, అఖిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు.