VIDEO: అయినవిల్లిలో వింత వాతావరణం

VIDEO: అయినవిల్లిలో వింత వాతావరణం

కోనసీమ: అయినవిల్లి మండలంలో ఆదివారం వింత వాతావరణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎండతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. ఈ వింత వాతావరణానికి ప్రజలు అవాక్కయ్యారు. గత మూడు రోజుల నుంచి ఏ సమయంలో వర్షం కురుస్తుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాబోయే 3 రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.