ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్ర సంబంధాలు

ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్ర సంబంధాలు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు గుర్తించారు. వెంటనే వారిని విధుల నుంచి తొలగిస్తూ జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరికి పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.