శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి  బెదిరింపు మెయిల్ పంపాడు. బాంబు పేలకూడదంటే ఒక మిలియన్ డాలర్‌లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్ట్‌లోని అన్ని ప్రాంతాలను భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు.