'మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలి'

ATP: రాయదుర్గం పట్టణంలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 24వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి యోగేశ్వరి తెలిపారు.గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజయోగిని దాది ప్రకాశమనీజీ వారి పవిత్ర స్మరణార్థం విశ్వబంధుత్వ దినము సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలన్నారు.