నేడు కేంద్ర కేబినెట్ భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మంత్రివర్గం భేటీ కానుంది. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇరు సభల్లో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితులపై, స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చించనున్నారు.