గుర్తుతెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి

NLR: అనంతసాగరం మండలం చాపూరాలపల్లి జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆనంద్ రెడ్డి(11) అనే విద్యార్థి మృతి చెందాడు. నవోదయ పరీక్ష రాసి ఇంటికొచ్చిన ఒక్కరోజులోనే బాలుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్సై సూర్యప్రకాష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.